శుక్రవారం మంత్రి సత్యకుమార్ యాదవ్ ధర్మవరంలో పర్యటిస్తారని బీజేపీ కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని పట్టణంలో నిర్వహించే ఐక్యత యాత్రలో విద్యార్థులతో కలిసి మంత్రి పాల్గొంటారు. అనంతరం, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు కార్యాలయంలో అందుబాటులో ఉంటారు.