చదరంగంలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన గుంతకల్లు విద్యార్థి

గుంతకల్లుకు చెందిన విద్యార్థి సాయి సౌరిష్ చదరంగంలో అంతర్జాతీయ రేటింగ్ సాధించి రికార్డు సృష్టించాడు. రోటరీ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న సౌరిష్, కర్నూలులో గత నెలలో జరిగిన అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో పాల్గొని రాపిడ్ రేటింగ్ 1,440, బ్లిట్జ్ రేటింగ్ 1,651 సాధించాడు. గుంతకల్లులో అత్యధిక రేటింగ్ సంపాదించిన క్రీడాకారుడిగా నిలిచిన అతన్ని పలువురు క్రీడా ప్రముఖులు అభినందించారు.

సంబంధిత పోస్ట్