గుంతకల్లులో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. వెజిటేబుల్ మార్కెట్ సమీపంలో పాత భవనాన్ని తొలగిస్తుండగా పైకప్పు కూలిపోవడంతో ఏకలవ్య నగర్కు చెందిన వెంకటరమణ అక్కడికక్కడే మృతి చెందాడు. నూతన భవన నిర్మాణానికి పాత భవనాన్ని కూల్చివేస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.