ఎమ్మెల్యే తనయుడు ఈశ్వర్ పర్యటన: కాలనీవాసుల సమస్యలపై హామీ

గుత్తి మున్సిపాలిటీలోని Z.వీరారెడ్డి కాలనీలో మంగళవారం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తనయుడు, గుత్తి మండలం ఇన్చార్జి గుమ్మనూరు ఈశ్వర్ పర్యటించారు. కాలనీవాసులు ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకుని, మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ ఆయనకు వినతిపత్రం అందజేశారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ, వీధిలైట్ల ఏర్పాటుతో పాటు రాత్రిపూట విష పురుగుల సంచారం సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి ఈశ్వర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గుత్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రతాప్, ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ అధ్యక్షుడు చికెన్ సీనా, శ్రీపురం సర్పంచ్ లింగమయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్