గుంతకల్లు కసాపురం గ్రామంలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయాన్ని ఆదివారం వెస్ట్ రైల్వే భద్రత కమిషనర్ శ్రీనివాసు, గుంతకల్లు రైల్వే డివిజనల్ మేనేజర్ చంద్రశేఖర్ గుప్తా సందర్శించారు. ఈ సందర్భంగా వారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.