వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 12న పామిడిలో జరగనున్న ఏడీసీసీ బ్యాంక్ మాజీ ఛైర్మన్ పామిడి వీర కుమార్తె లిఖిత వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఆయన రాక సందర్భంగా పట్టణంలో భారీ కటౌట్లు ఏర్పాటు చేసి, హెలిప్యాడ్ సిద్ధం చేస్తూ వైసీపీ నేతలు స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు.