లండన్‌లో ఉన్నత విద్యనభ్యసిస్తున్న హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి కుమారుడు బీకే సాయి కళ్యాణ్, లండన్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు సాయి కళ్యాణ్‌ను అభినందించి ఆశీర్వదించారు.