లేపాక్షి మండలం కల్లూరు పంచాయతీలో మంగళవారం వైస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. హిందూపురం వైకాపా నాయకుడు వేణు రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన వైకాపా నాయకులు వేణురెడ్డికి మేళతాళాలతో స్వాగతం పలికారు.