లేపాక్షి: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించండి

లేపాక్షి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఏఐఎస్పి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం, విద్యార్థి సంఘం నేతలతో కలిసి మండల ఎంఈఓ నాగరాజుకు వినతిపత్రం అందించారు. అన్నం రుచిగా లేకపోవడంతో విద్యార్థులు ఇంటి నుండి క్యారియర్లు తెచ్చుకుంటున్నారని ఎంఈఓ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని వారు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్