కార్తిక పౌర్ణమి సందర్భంగా బుధవారం కదిరి పట్టణంలోని శివాలయంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, రాష్ట్ర ప్రజలందరిపై పరమశివుని కృప ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు తీర్థప్రసాదాలు అందజేశారు.