ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య మెగా జాబ్ మేళా బ్రోచర్స్ విడుదల

వచ్చే నెల డిసెంబర్ 13న అమరావతిలోని హిందూ కాలేజ్ అఫ్ ఫార్మసీలో ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా బ్రోచర్లను సోమవారం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు, కళ్యాణదుర్గం బ్రాహ్మణ సంఘం సభ్యులతో కలిసి విడుదల చేశారు. ఈ జాబ్ మేళాకు 50కు పైగా బహుళజాతి కంపెనీలు హాజరుకానున్నాయి. 10వ తరగతి, ఐటిఐ, ఏదైనా డిగ్రీ, బీటెక్, బీఫార్మసీ, ఎమ్ ఫార్మసీ చదివినవారు, ఫ్రెషర్లు, అనుభవం ఉన్నవారు పాల్గొనవచ్చు.

సంబంధిత పోస్ట్