దుర్గం: హామీలు నిలుపుకుంటున్నాం: ఎమ్మెల్యే సురేంద్రబాబు

ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు, అధికారంలోకి వచ్చిన యేడాదిన్నరలోనే అనేక గ్రామాలకు రోడ్లు నిర్మించామని, త్వరలోనే మరిన్ని రోడ్లు మంజూరు చేయిస్తామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలిపారు. సోమవారం ఆయన శెట్టూరు మండలం చెర్లోపల్లి ప్రధాన రహదారి నుంచి కైరేవు గ్రామానికి రూ. కోటితో 1.5 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి స్థానిక టీడీపీ నాయకులు, అధికారులతో కలిసి భూమిపూజ చేశారు. ఇచ్చిన హామీని తప్పకుండా నిలుపుకుంటామని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్