కళ్యాణదుర్గం: ఏఎస్ఐనని చెప్పి మోసం చేసిన సైబర్ నేరగాళ్లు

కుందుర్పిలో పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్న సుదర్శన్ రెడ్డి, సెల్పాయింట్ యజమాని అస్లాంబాషాలను ఏఎస్ఐ ఆనందరావు పేరుతో ఫోన్ చేసి మోసం చేశారు. తమవారు ఆస్పత్రిలో ఉన్నారని, వెంటనే డబ్బులు ఫోన్ పే చేయాలని చెప్పి సుదర్శన్ రెడ్డి నుంచి రూ. 70 వేలు, అస్లాంబాషా నుంచి రూ. 40 వేలు వసూలు చేశారు. బాధితులు పోలీసులను ఆశ్రయించగా, ఆనందరావు అనే ఏఎస్ఐ ఆ స్టేషన్ లో లేరని తేలింది. ఈ ఘటనతో మోసగాళ్లు పోలీసుల పేరుతో ప్రజలను ఎలా దోచుకుంటున్నారో స్పష్టమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్