టీడీపీ కార్యకర్తల సంక్షేమమే విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ లక్ష్యమని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలిపారు. శనివారం కళ్యాణదుర్గం పట్టణంలో పింఛన్లు పంపిణీ చేసిన ఆయన, మంత్రి లోకేశ్ ఈనెల 7న కళ్యాణదుర్గానికి వస్తున్నారని, 8న కనకదాసు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని వెల్లడించారు. రాచప్పబాని కాలనీకి చెందిన చేనేత కార్మికుడు రంగస్వామి కుటుంబానికి రూ. 50వేల నగదు సాయాన్ని కూడా ఎమ్మెల్యే అందజేశారు.