ఆదివారం రాత్రి ప్రజా వేదికలో 2025 ఐసీసీ మహిళా క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ను ఎమ్మెల్యే సురేంద్రబాబు, టిడిపి నాయకులు, మహిళలు వీక్షించారు. సౌత్ ఆఫ్రికాపై భారత మహిళా జట్టు విజయం సాధించి వరల్డ్ కప్ గెలవడం 140కోట్లకు పైగా భారతీయులకు గర్వకారణమని ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్నారు. రాబోవు రోజుల్లో అన్ని రంగాలలోనూ భారత మహిళా జట్టు స్ఫూర్తితో ముందుకు సాగుతారని, ఈ ఘన విజయం సాధించిన జట్టుకు అభినందనలు తెలిపారు.