గుడిబండ: డ్రోన్ కెమెరాతో పోలీసుల గస్తీ

గుడిబండ చుట్టుపక్కల ప్రాంతాల్లో జూదం, ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా డ్రోన్ కెమెరాతో పోలీసులు గట్టి చర్యలు చేపట్టారు. ఆదివారం సైతం డ్రోన్ కెమెరాతో పోలీసులు తనిఖీలు చేపట్టగా జూద కేంద్రం బయటపడింది. జూదరులు పారిపోవడంతో పోలీసులు అక్కడికి చేరుకొని జూదానికి వాడే ప్లేయింగ్ కార్డ్స్ ని దహనం చేశారు. పోలీసులు తీసుకుంటున్న చర్యల పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్