మంగళవారం, సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మడకశిర పట్టణంలో పర్యటించారు. హంద్రీనీవా కాలవల ద్వారా అమరాపురం, రొళ్ల గుడిబండ చెరువులకు నీటి విడుదలను వారు పరిశీలించారు. పంపింగ్ కేంద్రం వద్దకు వెళ్లి నీటి విడుదల ప్రక్రియను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.