మడకశిర పట్టణంలో మంగళవారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు చెకుముకి సైన్స్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. విద్యార్థుల్లో సైన్స్ పట్ల అవగాహన పెంపొందించడమే తమ ప్రధాన లక్ష్యమని జిల్లా జన విజ్ఞాన వేదిక కార్యదర్శి శ్రీనివాసులు తెలిపారు.