రాష్ట్రంలోని టెక్స్ టైల్స్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి తొమ్మిది కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. బుధవారం అమరావతిలోని వెలగపూడి రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్ లో తొమ్మిది కంపెనీల ప్రతినిధులతో మంత్రి సవిత సమావేశం నిర్వహించారు. వీరిలో అయిదుగురు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే పార్టనర్ షిప్ సమ్మిట్ లో రాష్ట్ర ప్రభుత్వంతో ఈ కంపెనీల ప్రతినిధులతో ఎంవోయూలు కుదుర్చుకోనున్నట్లు మంత్రి వెల్లడించారు.