సోమందేపల్లి: కోటి సంతకాలతో కూటమి మెడలు వంచుతాం.. మాజీ మంత్రి

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ గురువారం సోమందేపల్లి మండల కేంద్రంలోని కొత్తపల్లి క్రాస్ వద్ద మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో జరిగిన రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కోటి సంతకాల సేకరణ ఉద్యమం కూటమి ప్రభుత్వ పతనానికి కారణం కాబోతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్