ఏపీ ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు మంగళవారం పుట్టపర్తి ఆర్టీసీ బస్టాండ్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్ లో ఉన్న ప్రయాణికులతో ఆయన మాటామంతి కలిపి, బస్సులు సమయానికి వస్తున్నాయా, సిబ్బంది పనితీరు ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు. సత్య సాయి బాబా శత జయంతోత్సవాల సందర్భంగా బస్టాండ్లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.