బెలుగుప్ప మండలం ఆవులెన్న గ్రామ శివారులో శుక్రవారం సాయంత్రం వ్యవసాయ తోటలకు సంబంధించిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను దొంగలు ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ట్రాన్స్ఫార్మర్లోని కాపర్, ఆయిల్ను దొంగలు అపహరించుకుపోయారు. బాధితులైన రైతులు రామాంజనేయులు, నారాయణస్వామి, విశ్వనాథు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.