దుర్గం: ఏడాది తర్వాత తప్పిపోయిన బాలుడిని అప్పగించిన పోలీసులు

గొర్రెలు మేపడం ఇష్టం లేక ఏడాది కిందట పారిపోయిన బాలుడు వడ్డే అంజనేయులును పోలీసులు శుక్రవారం అతడి తల్లిదండ్రులకు అప్పగించారు. గుమ్మఘట్ట మండలం గోనబావి గ్రామానికి చెందిన వడ్డే మారెప్ప, వడ్డే ఈరక్కల కుమారుడు వడ్డే ఆంజినేయులు గత ఏడాది అక్టోబరు 15న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. ఆంజనేయులు కోసం కర్ణాటక, రాష్ట్రంతో సుదూర ప్రాంతాలలో గాలించారు. ప్రత్యేక బృందం బెంగళూరు నగరంలో గుర్తించి, బాలుడిని తెచ్చి శుక్రవారం తల్లిదండ్రులకు అప్పగించినట్లు సీఐ వెంకటరమణ తెలిపారు.

సంబంధిత పోస్ట్