రాయదుర్గం: చురుగ్గా లీజు ప్రాంతాల హద్దుల గుర్తింపు

డి. హీరేహాళ్ మండలంలోని ఇనుప గనుల కొండల్లో లీజుప్రాంతాల హద్దుల గుర్తింపు ప్రక్రియ శుక్రవారం చురుకుగా సాగింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో రెండురోజులుగా జరుగుతున్న పనులు కొనసాగాయి. అటవీశాఖ, మైన్స్ అండ్ జియాలజీ, ల్యాండ్ రెవెన్యూ అధికారులు సంయుక్తంగా పర్యటించి ఆరు మైనింగ్ లీజుల ప్రాంతాల హద్దులను గుర్తించారు. ఓఎంసీ, వైఎం, ఏఎంసీ, బీఐఓపీ లీజులకు సంబంధించి జీపీఎస్ పాయింట్లను గుర్తించి, రాళ్లను ఏర్పాటు చేశారు. తవ్వకాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

సంబంధిత పోస్ట్