రాయదుర్గం మండలంలోని 74 ఉడేగోళంలో మంగళవారం ఆంజనేయస్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు చేశారు. ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం జరిగిన రథోత్సవంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.