బొమ్మనహాల్ మండలంలో అక్రమంగా కల్లు విక్రయాలు యధేచ్చగా సాగుతున్నాయి. రాత్రింబవళ్లు కల్లు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని, కాలువల పక్కన దుకాణాలున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు మంగళవారం తెలిపారు. దీంతో ఏకంగా దేవాలయం పక్కనే కల్లు దుకాణం ఏర్పాటు చేయడంతో భక్తులు, మహిళలు ఆలయానికి వెళ్లడానికి జంకుతున్నారు. కాలువల్లో పడి చనిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బెళుగుప్ప నుంచి బొమ్మనహాల్ కు వాహనాల్లో కల్లును అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం.