రాయదుర్గం: రెండు రోజులుగా నీరు వృథా

బొమ్మనహాళ్ మండలంలోని ఎల్బీనగర్ గ్రామం వద్ద శ్రీరామిరెడ్డి పథకం తాగునీటి పైపులైన్ నుంచి రెండు రోజులుగా నీరు వృథా అవుతోంది. సోమవారం ఆయా గ్రామాల ప్రజలు ఈ విషయాన్ని తెలిపారు. అధికారులకు చెప్పినా ఎవరూ స్పందించడం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా తాగునీరు వృథా కావడంతో గ్రామాలలో తాగునీటికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వెంటనే పగిలిన పైప్ లైన్ కు మరమ్మత్తులు చేయాలని ప్రజలు కోరారు.

సంబంధిత పోస్ట్