శింగనమల: పంచాయతీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే

సోమవారం బుక్కరాయసముద్రంలోని విజయనగర్ కాలనీలో పర్యటించిన శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి, స్థానిక పరిస్థితులు చూసి పంచాయతీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల సీసీ రోడ్లు, కాలువల్లో పూడిక తీయకపోవడంతో దుర్గంధం వెదజల్లుతోందని ఆమె అన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన ఎమ్మెల్యే, ప్రతినెలా 3వ శనివారం స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్