బుధవారం రాత్రి ఎల్లనూరు మండలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా రెండు ఇళ్లు కూలిపోయాయి. మండల కేంద్రంలో నివాసముంటున్న విజయ్ వెంకటరమణ స్వామి, బాషాకు చెందిన ఇళ్లు ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఎవరూ ఇంట్లో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని నష్టాన్ని పరిశీలించారు.