ఉరవకొండ మండలంలో కుటుంబ కలహాలు, రూ.11 లక్షల అప్పుల బాధతో రైతు మంజునాథ్ రెడ్డి (40) గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. నెరమెట్లకు చెందిన ఆయన సొంత, కౌలు భూముల్లో మిరప సాగు చేసి, వరుస నష్టాలతో అప్పుల పాలయ్యాడు. శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.