ఉరవకొండ: అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి సమీక్ష

శనివారం కౌకుంట్లలోని తన నివాసంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఉరవకొండ మండలంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉరవకొండలో డ్రైనేజీ, త్రాగునీటి సరఫరా అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వివిధ పథకాల ద్వారా మంజూరైన నిధుల వినియోగం, అమలవుతున్న అభివృద్ధి పనుల గురించి చర్చించారు.

సంబంధిత పోస్ట్