నేడు ఆంధ్రా యూనివర్సిటీ బంద్

AP: ఆంధ్రా యూనివర్సిటీ హాస్టల్‌లో బీఈడీ విద్యార్థి మణికంఠకు సకాలంలో చికిత్స అందక గురువారం ఉదయం మరణించిన విషయం తెలిసిందే. దీనిపై అధికారులు స్పందించకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. వైఎస్ ఛాన్సలర్ రాజశేఖర్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. శుక్రవారం కూడా ఆందోళన చేపట్టారు. క్లాసులు, పరీక్షలు బహిష్కరించి యూనివర్సిటీ బంద్‌కు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్