AP: ‘అన్నదాత సుఖీభవ’ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా అర్హత సాధించిన రైతుల్లో లక్షల మంది ఆధార్ కార్డులోని వివరాలు వెబ్‌ల్యాండ్‌లోని వివరాలతో అనుసంధానం జరగలేదు. రైతుల వివరాల్లో తప్పులను సరిదిద్దనందున తహసీల్దార్ల లాగిన్‌లలో వివరాలు వేలల్లో పెండింగులో ఉన్నాయి. దాంతో అర్హుల జాబితాలో తమ పేర్లు కనిపించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వం జిల్లాల అధికారులను ఆదేశించింది. కాగా, శనివారం రైతుల ఖాతాలో రూ.7వేలు జమకానున్నాయి.