తిట్టిందని ఒక మహిళను మరో మహిళ కొడవలితో నరికి తీవ్రంగా గాయపరచిందని బుధవారం మదనపల్లి సిఐ కళా వెంకటరమణ తెలిపారు. వేంపల్లికి చెందిన రమణమ్మ (60) అదే వీధిలో ఉండే శ్రీదేవిని తిట్టిందనే సాకుతో కొడవలితో గాయపరిచింది. కుటుంబీకులు వెంటనే మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.