మదనపల్లె: వృద్ధుడిపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

మదనపల్లెలో గురువారం ఓ వృద్ధుడిపై ఆర్టీసీ బస్సు దూసుకెళ్లిన ఘటన కలకలం రేపింది. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం చండ్రమాకులపల్లెకు చెందిన వెంకటప్ప(70) మదనపల్లె టౌన్ బ్యాంక్ కూడలిలో ఉండగా, పుంగనూరు వైపు నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఆయనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వెంకటప్పను స్థానికులు తక్షణమే జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్