జాతీయ ర్యాబిస్ డే సందర్భంగా ఆదివారం మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో అవగాహన కార్యక్రమం జరిగింది. డాక్టర్ ప్రణవ్ భార్గవ్ మాట్లాడుతూ కుక్క కరిచిన వెంటనే భయపడాల్సిన అవసరం లేదని, సమీప ప్రభుత్వ ఆస్పత్రిలో లభ్యమయ్యే యాంటీ ర్యాబిస్ ఇంజక్షన్లు తప్పనిసరిగా కోర్సు ప్రకారం వేయించుకోవాలని సూచించారు. అనంతరం అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నర్సింగ్ సూపరింటెండెంట్ విజయ, రెడ్డిరాణి, హేమావతి, గులాబ్ జాన్ పాల్గొన్నారు.