మైనర్ బాలిక ప్రసవం — పీలేరు ప్రాంతంలో కలకలం

సోమవారం రాత్రి కె. వి. పల్లి మండలం మదిపట్ల వాండ్లపల్లి పంచాయతీకి చెందిన 17 ఏళ్ల బాలిక సుండుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చిన ఘటన కలకలం రేపింది. పీలేరులోని ఒక కళాశాలలో చదువుతున్న ఆమె, ప్రైవేట్ పాఠశాల వాహన డ్రైవర్ మల్లారపు హరీష్‌తో పరిచయం ఏర్పడి ప్రేమలో పడి గర్భం దాల్చినట్లు సమాచారం. ఈ విషయం బయటపడిన తర్వాత కళాశాల మానేసి మూడు నెలలుగా బంధువుల వద్ద ఉన్న ఆమె, కడుపునొప్పి రావడంతో ఆసుపత్రికి చేరి ప్రసవించింది. కేవీ పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్