ప్రొద్దుటూరు మహిళకు ఐకానిక్ అవార్డు

అంతర్జాతీయ స్థాయి పోటీల్లో కడప జిల్లా మహిళ సత్తా చాటింది. ప్రొద్దుటూరుకు చెందిన సుజిత బ్యూటీ క్లినిక్ నడుపుతున్నారు. చెన్నై వేదికగా డబ్ల్యూ బీపీసీ ఆధ్వర్యంలో కాస్మటాలజిస్ట్ పోటీలు నిర్వహించారు. ఇందులో 18 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొనగా వరల్డ్ బ్యూటీ కాస్మటాలజిస్ట్, అస్థెటిక్ ఐకాన్ అవార్డులను సుజిత దక్కించుకున్నారు. హీరో విశాల్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. బుధవారం ఆమెను పలువురు అభినందించారు.

సంబంధిత పోస్ట్