రాజంపేట మండలం పోలి అప్పారాజుపేట చర్చి వద్ద బుధవారం కూలీ మన్యం రవిపై చర్చి పాస్టర్ యాసిడ్ దాడి చేశాడని పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాల కారణంగా రాజీకి వెళ్లిన రవిపై ఈ దాడి జరిగినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన రవిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.