రాజంపేట మండలంలోని ఆర్టీవో కార్యాలయం సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు గాయపడ్డారు. రాజంపేట నుంచి నందలూరు వైపు వెళ్తున్న ద్విచక్రవాహనం, హస్తవరం నుంచి రాజంపేట వైపు వస్తున్న మరో బైక్‌ను ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.