చిన్నమండెం: రోడ్డుప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి

అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం కేశాపురం సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భూపాల్ (24) అనే లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. రోడ్డు పక్కన ఆగి ఉన్న టమోటా లారీని ఐషర్ వాహనం ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న చిన్నమండెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు చిత్తూరు వాసిగా గుర్తించారు.

సంబంధిత పోస్ట్