సీఎంపై అసభ్య పోస్టుల కేసు.. దర్యాప్తు వేగవంతం

అన్నమయ్య జిల్లాలో సీఎం నారా చంద్రబాబుపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు చేసిన కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. 'ఇడ్లీ, వడ, సాంబార్' ఫేస్‌బుక్ ఖాతా ద్వారా సీఎం ఫోటోలను మార్ఫింగ్ చేసి పోస్టు చేశారని ఆరోపణలున్నాయి. ఈ ఘటనపై టీడీపీ యూత్ అధ్యక్షుడు చాకన రాజా ఫిర్యాదుతో 2024 నవంబర్‌లో కేసు నమోదైంది. కొత్తకోటకు చెందిన హనుమంత్‌రెడ్డి పాత్రపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా, సజ్జల భార్గవ్‌రెడ్డిని సోమవారం మదనపల్లె డీఎస్పీ పావని ప్రశ్నించనున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్