ములకలచెరువు కల్తీ మద్యం కేసులో ఏ-17గా జయచంద్రారెడ్డి

ములకలచెరువు నకిలీ మద్యం కేసులో టీడీపీ నుంచి సస్పెండైన తంబళ్లపల్లె ఇన్‌చార్జి జయచంద్రారెడ్డిని ఎక్సైజ్ అధికారులు ఏ-17 నిందితుడిగా చేర్చారు. ప్రధాన నిందితుడు జనార్ధనరావు అనుచరుడు కట్టా రాజు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మరో తొమ్మిది మందిని కొత్తగా చేర్చడంతో కేసులో నిందితుల సంఖ్య 23కి చేరింది. జయచంద్రారెడ్డితో పాటు ఆయన బావమరిది గిరిధర్ రెడ్డి, డ్రైవర్ అష్రఫ్, బాలాజీ, సుదర్శన్, నకిరికంటి రవి, శ్రీనివాసులు రెడ్డి, చైతన్యబాబు తదితరుల పేర్లు జాబితాలో ఉన్నాయి. జయచంద్రారెడ్డిని అరెస్టు చేసేందుకు ఎక్సైజ్ అధికారులు బెంగళూరులో ప్రత్యేక బృందాలు మకాం వేశారు, ఏ క్షణమైనా అరెస్టు జరిగే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్