ములకల చెరువు: మద్యం సేవించి వ్యక్తి మృతి

ములకల చెరువులో మద్యం సేవించి శ్రీరాములు అనే వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. మృతుడు సత్యసాయి జిల్లా తనకల్లు మండలం బొంతలపల్లి పంచాయతీ ఎర్రవల్లికి చెందిన వారని గుర్తించారు. ములకల చెరువు సరిహద్దు ప్రాంతంలో నిత్యం కల్తీ మద్యం సేవించడం వల్లే ఆయన మరణించారని బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతుడి కుమార్తె రేణుక మాట్లాడుతూ, “నకిలీ మద్యం తాగడం వల్లే నాన్న ప్రాణాలు కోల్పోయారు” అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్