ములకలచెరువు మండలంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు విశ్వనాథరెడ్డి (50) తీవ్రంగా గాయపడ్డారు. బురకాయలకోట పంచాయితీ, ఎర్రంరెడ్డిగారిపల్లికి చెందిన ఆయన కొత్తకోటలో విధులు నిర్వహిస్తున్నారు. విధులు ముగించుకుని రాత్రి ఇంటికి వస్తుండగా, వేమిలేటికోట వద్ద బైక్ ప్రమాదంలో ఆయనకు గాయాలయ్యాయి. బాధితుడిని మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.