శుక్రవారం నకిలీ మద్యం కేసులో జయచంద్రారెడ్డిని ఇంచార్జ్ పదవి నుండి తప్పించిన నేపథ్యంలో, తంబళ్లపల్లె నియోజకవర్గంలో టీడీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్‌ను నియోజకవర్గ ఇంచార్జ్‌గా నియమించాలని ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాస్ రావుకు విన్నవించారు. ఈ మేరకు శంకర్ యాదవ్ ద్వారా తమ అభ్యర్థనను ఆయనకు సమర్పించారు.