అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో అక్టోబర్ 31న ఎస్టీ గురుకుల పాఠశాల 9వ తరగతి విద్యార్థి చరణ్ అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. ములకలచెరువు సీఐ వెంకటేశులు, ఎస్ఐ ఉమామహేశ్వర్ దర్యాప్తు చేపట్టి, సోమవారం గండి అంజనేయస్వామి ఆలయం సమీపంలో చరణ్‌ను గుర్తించారు. జిల్లా ఎస్పీ ధీరజ్, విద్యార్థిని సురక్షితంగా గుర్తించిన పోలీసులను అభినందించారు. అనంతరం బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు.