అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె సమీపంలోని మల్లయ్యకొండకు వెళ్లే రోడ్డులో దర్గా వద్ద ఉన్న ఓ వ్యవసాయ బావిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. బుధవారం ఉదయం మార్గమధ్యంలో వెళ్తున్న కొందరు వ్యక్తులు బావిలో మృతదేహాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ ఉమ మహేశ్వరరెడ్డి తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.