కడిగిన ముత్యంలా బయటకు వస్తా: జయచంద్రారెడ్డి

ములకలచెరువు కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ టీడీపీ నుండి సస్పెండ్ అయిన జయచంద్రారెడ్డి మంగళవారం స్పందించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఎక్సైజ్ శాఖ విచారణలో నిజాలు వెలుగులోకి వస్తాయని ఆయన అన్నారు. రాజకీయంగా తనకు అండగా ఉన్న నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయాన్ని శిరసావహిస్తానని, త్వరలోనే "కడిగిన ముత్యంలా బయటకు వచ్చి" అధినేత మన్ననలు పొందుతానని జయచంద్రారెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్