ఏపీలో మహిళలకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అందించింది. ఆర్టీసీ ప్రయాణికులకు మరింత మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం కొత్తగా 1500 బస్సులు కొనాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. త్వరలో 1050 విద్యుత్ బస్సులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అన్నారు. రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళల ప్రయాణానికి రద్దీ పెరుగుతోంది. తాజా నిర్ణయంతో మహిళలు సౌకర్యవంతగా ప్రయాణించవచ్చు.